Thursday, May 2, 2024
- Advertisement -

మెగాఫోన్ పట్టనున్న హీరోయిన్‌!

- Advertisement -

ఇండస్ట్రీలోకి నటులుగా వచ్చి దర్శకులుగా మారిన హీరో, హీరోయిన్స్ ఎందరో. హీరోల సంగతి పక్కన పెడితే హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. ప్రస్తుత జనరేషన్‌లో నందిని రెడ్డి, లక్ష్మీ సౌజన్య, గౌరీ వంటి దర్శకురాళ్లు ఆడియన్స్‌ను మెప్పించే సినిమాలు తీసి సక్సెస్ కాగా వీరి బాటలోనే ఇప్పుడు ఓ తెలుగమ్మాయి రాబోతుంది.

సంజన అన్నే…టాలీవుడ్‌లో పలు సినిమాల్లో మెప్పించిన ఈ బ్యూటీ లు ఇప్పుడు డైరెక్టర్ అవతారం ఎత్తనున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భరత్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుండగా ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సంజన అన్నే.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనుండగా సంజన అన్నేకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మరి దర్శకురాలిగా ఈ బ్యూటీ రాణిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -