Tuesday, May 14, 2024
- Advertisement -

బాహుబ‌లి రికార్డుల‌ను బద్ధలు కొట్టిన సంజు

- Advertisement -

బాహుబలి సినిమా ఎంత‌టి రికార్డులు సృష్టించిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే.హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులను క్రియేట్‌ చేసింది. ఇండియాతోపాటు విదేశాల‌లో కూడా ఈ సినిమా బాగానే క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.అయితే ఈ సినిమాను రికార్డుల‌ను బ్రేక్ చేసే సినిమా ఇప్ప‌టిలో వ‌స్తుందా అని చాలా మంది ఎదురు చూశారు.

అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు భారీస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్‌ చేసినప్పటికీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఎట్టకేలకు రీసెంట్‌ రిలీజ్‌ సంజు బాహుబలి-2 నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం అధిగమించింది. ఈ చిత్రం మూడో రోజు రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2 పేరిట ఉంది. బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్‌ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -