Friday, May 3, 2024
- Advertisement -

సైఫ్ ఆలీఖాన్ కుమార్తె తెరంగేట్రం

- Advertisement -

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ హీరోల కుమార్తెలు తెరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ హీరో సైఫ్ ఆలీ ఖాన్ గారాల పట్టి సారా ఆలీఖాన్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యువేషన్ తీసుకున్న సారా ఆలీఖాన్ ఈ మధ్యే ముంబాయ్ తిరిగి వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో సారా నటించనున్నది.

ఆమెను ఎంత త్వరగా వెండితెరపై చూస్తానా అని సవతి తల్లి, సైఫ్ ఆలీఖాన్ రెండో భార్య కరీనా కపూర్ ఆరాటపడుతోంది. సారా ఎంతో అందగత్తె అని, తెలవైనదని, ఎంతో ధైర్యం కూడా ఉందని కరీనా అంటోంది. సారాను వెండితెరపై చూసేందుకు నేను, సైఫ్ ఎదురుచూస్తున్నాం అంటూ ట్విట్ చేసింది కరీనా కపూర్.

తన కుమార్తెకు ఏది ఇష్టమో ఆదే చేస్తుందని, తాను తనను ఎప్పుడు అడ్డు చెప్పనని సైఫ్ ఆలీఖాన్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సారా ఆలీఖాన్ హీరో సైఫ్ ఆలీఖాన్, అమ్రతాసింగ్ ల కుమార్తె. ఆ మధ్య వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైఫ్ ఆలీ ఖాన్ కరీనా కపూర్ పెళ్లి చేసుకున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -