Friday, May 17, 2024
- Advertisement -

అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్

- Advertisement -

విరాట్ కొహ్లి. భారత క్రికెట్ గర్వించతగిన ఆటగాడు. ఈ మధ్యనే ఓ ఇంటివాడయ్యాడు. అదేంటి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా. అదేం కాదు. ఓ ఇంటి వాడయ్యాడు అంటే ఇల్లు కొనుక్కున్నాడు అని అర్ధం అన్నమాట. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ నిర్మించిన ఓ అపార్ట్ మెంట్ లో ఐదు బెడ్ రూంలున్న అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేశాడు కొహ్లి.

2015 సంవత్సరంలో ఈ అపార్ట్ మెంట్ కడుతున్న ప్రాంతాన్ని తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి చూశాడు. ఐదు బెడ్ రూంలున్న ఈ ఇంటి నుంచి నేరుగా సముద్రాన్ని చూడవచ్చు. ఇది 35 వ అంతస్తులో ఉండడం విశేషం.

దాదాపు 7,171 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఈ ఇల్లు ఖరీదెంతో తెలుసా. పెద్ద ఎక్కువేం కాదు. కేవలం 34 కోట్ల రూపాయలే. అది మనకి ఎక్కువ కాని… విరాట్ కొహ్లికి కాదు కదా.  ఇదే అపార్ట్ మెంట్ లో టవర్ సిలో యువరాజ్ సింగ్ కూడా ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశాడు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -