Monday, April 29, 2024
- Advertisement -

రైల్వే శాఖ పోటీలో ప్రదర్శన

- Advertisement -

నీళ్ల అవసరం లేకుండా టాయిలెట్లు. ఇది నిజమా అనుకుంటున్నారా. నిజమే. మణిపాల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్(ఎఫ్ఓఏ) చదువుతున్న వినోద్ అంథోని థామస్ దీనిని తయారు చేశారు. అది కూడా ఇండియన్ రైల్వేలకు అనుకూలించే విధంగా ఆంథోనీ   ఈ టాయిలెట్‌ను రూపొందించారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) నిర్వహించిన ఓ పోటీలో.. ఇలాంటి టాయిలెట్స్ డిజైన్ చేయాలని పేర్కొంది.

మన రైల్వేల్లో టాయిలెట్ల నిర్వహణ, ట్రాక్ లను శుభ్రం చేయడం వంటివి ఎంతో శ్రమతోనూ, ఎక్కువ నీటి వినియోగంతోనూ కూడుకున్నవి. అంతే కాకుండా వీటి వల్ల పర్యావరణానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో మణిపాల్ లో చదువుతున్న ఆంథోనీ దీన్ని కనుగొన్నాడు. బిన్ వినియోగం ద్వారా టాయిలెట్లలో నీటిని తక్కువగా వినియోగించవచ్చునని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఈ పోటీని పెట్టారు. మే నెలలో ఈ పోటీలకు ఎంట్రీలు వచ్చాయి. ఆంథోనీ, రాహుల్, సౌరభ్ హాన్స్ అనే ముగ్గురు రూపొందించిన ఈ కొత్త టాయిలెట్ విధానానికి ప్రధమ బహుమతి వచ్చింది. వీరికి 75 వేల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -