Saturday, April 20, 2024
- Advertisement -

నమితతో పెళ్లిపై శరత్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు

- Advertisement -

ఇటివలే సోషల్ మీడియాలో నమిత.. సీనియర్ నటుడు శరత్ బాబు తో రిలేషన్ లో ఉందని.. అతని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తాజాగా రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ శరత్ బాబు వరకు వెళ్లడంతో ఆయన ఇటివలే స్పందించారు. తను నటి నమితను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా.. ఆమెతో ప్రస్తుతం సహజీవనంలో ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని శరత్ బాబు ఆ వార్తలను ఖండించారు.

అరవై యేళ్లు దాటిన శరత్ బాబు, 36 సంవత్సరాల వయసున్న నమితను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇటీవల పుకార్లు ఊపందుకున్నాయి. కోలీవుడ్ తో మొదలై ఈ రూమర్లు టాలీవుడ్ వరకూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన ఈ విషయంపై స్పందించారు. నమితను తను పెళ్లి చేసుకోబోవడం అనేది కేవలం రూమర్ అని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే ఖచ్చితంగా ముందు మీడియాకే చెబుతానని ఆయన అన్నారు. తన పై ఇలాంటి వార్తలను రాయవద్దు అని ఆయన అన్నారు. ఈ పుకార్లను నమ్మి కొంతమంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇప్పటికీ రొమాంటిక్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు.. అని అంటున్నారని శరత్ బాబు వ్యాఖ్యానించారు.

అయితే తన విషయంలో పుకార్లను నమ్మవద్దని శరత్ బాబు స్పష్టం చేశారు. నమితను తను చివరి సారి చూసింది ఎనిమిదేళ్ల క్రితం అని ఆయన అన్నారు. తామిద్దరం ఒక సినిమాలో కలిసి నటించాం.. ఆ తర్వాత ఆమెను మళ్లీ చూడలేదని అన్నారు. తనకంటూ ఒక క్యారెక్టర్ ఉందని.. ఇలాంటి అబద్దాలు రాయవద్దు అని ఆయన అన్నారు. ప్రస్తుతానికి అయితే పెళ్లి ఆలోచన అయితే లేదు.. ఏదైన ఉంటే ముందు మీడియాకే చెబుతానని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -