Sunday, May 5, 2024
- Advertisement -

నిరుద్యోగ భృతి కి చంద్రబాబు సన్నాహాలు….

- Advertisement -

ప్ర‌తిప‌క్ష‌పార్టీనేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌ల‌పెట్ట‌నున్న పాద‌యాత్రతో టీడీపీ నాయ‌కులతోపాటు, చంద్ర‌బాబు గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి. అందుకే మొద‌టినుంచి పాద‌యాత్ర‌పై బుర‌ద జ‌ల్లేందుకు ఆరాట‌ప‌డుతున్నారు. పాద‌యాత్ర‌తో బాబు ఎక్క‌డ స‌మ‌స్య‌ల్లో ప‌డ‌తానోన‌ని బాబు స‌న్నాహాలు చేస్తున్నారు.

జగన్ పాదయాత్ర చేయడానికి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో బాబు ముందు జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలతోపాటు, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌నె అంశాల‌గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తార‌న‌డంలో సందేహంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి, పనితీరుగురించి ప్రజల ఎదుట విరుచుకు పడే ప్రమాదం ఉన్నదో.. ఆయా అంశాల్లో ముందు జాగ్రత్తగా కొంత పురోగతి చూపించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాయా కసరత్తులు ప్రారంభించింది.

యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ఎందరు భృతికి అర్హులైన నిరుద్యోగులు ఉన్నారో లెక్క తేల్చాలని అధికారుల్ని పురమాయిస్తున్నారు. ప్రాథమికంగా 33 లక్షల మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతుండగా, మంత్రి లోకేష్, ఆర్థిక నిపుణుడు కుటుంబరావులు కలిసి ఖచ్చితమైన సంఖ్యను తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జగన్మోహన రెడ్డి ఇటీవల అనంతపురంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో కూడా ఈ నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. అందుకే ఆ విషయంలో చంద్రబాబు సర్కార్ అలర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది.

ఇక జగన్ పాదయాత్ర ప్రారంభం అయితే నిరుద్యోగ‌భ్రుతిపై యువతలో వెల్లువెత్తే వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం అని.. జగన్ యాత్రకు వెళ్లేలోగానే భృతి విషయంలో తాము ఏదో ఒకటి చేసేస్తున్నట్లుగా కలర్ ఇవ్వడం అవసరం అని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే హడావిడిగా లెక్కల పేరిట నిరుద్యోగుల గణాంకాలు ప్రకటించి.. త్వరలో పంపిణీలు ఉంటాయనే సంకేతాలు ఇస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఈ అంశం మీద ఇంత వేగంగా స్పందిస్తున్నదంటే.. అది జగన్ సాధించిన విజయం అని చెప్ప‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -