Wednesday, May 15, 2024
- Advertisement -

కమ్మ వర్గ సోపోర్టుకు కేసీఆర్ తహతహ

- Advertisement -

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గ పోరు… పోరాట యోధుడు కేసీఆర్ కు చుక్కలు కనిపించేలా చేస్తున్నాయి. వెలమ వర్గాన్ని టార్గెట్ చేస్తూ… అన్నీ మీకేనా మాకేం లేవా అన్నట్లుగా కొందరు రెడ్లు వెలమ నేతపై విరుచుకుపడుతున్నారు. ముందునుంచి కేసీఆర్ పై ఒంటికాలితో లేచే రేవంత్ రెడ్డి ఈవిషయంలో మాంచి దూకుడు మీదున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గురువారం జరిగిన రెడ్డి పోరు యాత్ర జరగడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డే అంటున్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు కూడా దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని చెబుతుంది. గతసారి ఎలక్షన్ లో కేసీఆర్ పార్టీకి ఫండ్ నందించారని చెబుతోన్న… అపోలో గ్రూఫ్ అధిపతి ప్రతాప్ రెడ్డి ఈసారి ఎలక్షన్స్ లో కేసీఆర్ కు ఏదో కొద్దిగ మాత్రమే ఫండింగ్ ఇచ్చేట్లుగా ఉన్నారు.

కేసీఆర్ పై రెడ్డి సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. అలాగే రెడ్లలో ఎవ్వరికీ సరైన పోస్ట్ ఇవ్వలేదని..ఆంధ్రాలో హోం మినిస్టర్ చిన్న రాజప్ప ఎలాగో… తెలంగాణలో హోం మినిస్టర్ నాయిని నర్శింహారెడ్డి అలాగని…చంద్రబాబు మాదిరిగా ఎంతో తెలివిగా రెడ్లలో అంతటి లౌక్యం లేని వారికి మంత్రి పదవులు ఇచ్చారని చెబుతున్నారు.

రెడ్డి పోరు యాత్రను అడ్డుకోవడానికి కాపులకు బాబు వేయికోట్లతో సంక్షేమ నిది ఎలా ఏర్పాటు చేశారో అదే విధంగా తెలంగాణాలో కేసీఆర్ వేయికోట్లతో సంక్షేమ నిదిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడని చెబుతున్నారు. గురువారం కొంపల్లిలో జరిగిన రెడ్డి పోరు యాత్రకు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీని వలన బోయినపల్లినుంచి తూప్రాన్ వరకు అనగా 40కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించిపోయింది. కాంగ్రెస్ లోని రెడ్లంతా ఎంతో తెలివిగా కేసీఆర్ ను ఇరికించడానికే ఈ తరహా స్కెచ్ వేశారని టిఆర్ ఎస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాని ఒకటి మాత్రం వాస్తవం… రెడ్డి పోరు యాత్రతో కేసీఆర్ దొర పోకడలు తగ్గించి న్యూట్రల్ గేమ్ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి.దానిలో భాగంగానే టిడిపితో టై అప్ కావడం. ఆవిధంగా కమ్మ మీడియాను వాడుకుని మళ్ళీ అధికారంలోకి రావచ్చనే యోచన కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -