- Advertisement -

” సర్దార్ సినిమా టికెట్టు దొరికితే చాలు రా బాబూ “

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులూ, ఇండస్ట్రీ జనాలు కూడా ఆసాక్తిగా ఎదురు చూసే సినిమా పవన్ కళ్యాణ్ దే కావడం విశేషం. ప్రస్తుతం అన్ని చోట్లా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించే ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఒచ్చే శుక్రవారం విడుదల కావడం తో థియేటర్ లలో టికెట్ ల కోసం అందరూ పిచ్చ పిచ్చగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టికెట్ లకి కనిపిస్తున్న క్రేజ్ ని చూస్తుంటే మతి పోతోంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఓవర్ సీస్ లో టికెట్ ధర అమాంతం పెరిగినా కూడా ఒక రేంజ్ లో సినిమా టికెట్ లు అమ్ముడు పోతూ ఉండడం విశేషం.

గురువారం అర్థరాత్రి నుంచే అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. దీంతో ఈ ప్రీమియర్ షోస్కి టికెట్స్ సాధించడం ఓ క్రేజీ అంశంగా మారిపోయింది. ఇండియా లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల అయితే అర్ధరాత్రి షో లకి 2000 ఉన్నా జనం ఎగబడి కొనేస్తున్నారు . ” టికెట్టు దొరికితే చాలు రా బాబూ ” అంటూ పవన్ ఫాన్స్ గొడవ గొడవ చేస్తూ ఉండడం విశేషం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -