Saturday, May 18, 2024
- Advertisement -

రెండు రోజుల్లోనే 100 కోట్లు

- Advertisement -

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ,స్టార్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం స‌ర్కార్‌.దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల అయిన ఈ సినిమాపై నెగిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికి క‌లెక్ష‌న్లు మాత్రం కుమ్మేస్తున్నాయ్.సినిమా విడుద‌ల అయిన రెండు రోజుల‌కే 100 కోట్లు సాధించి సంచ‌ల‌నం సృష్టించింది.విజ‌య్ న‌టించిన చిత్రాల్లో ఇదే అత్య‌ధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, వసూళ్లపరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 56.90 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగించింది. రెండు రోజులను కలుపుకుని ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రజనీకాంత్ ‘కాలా’ సినిమా వసూళ్లను కూడా ‘సర్కార్’ అధిగమించింది.వారంతంలోనే సినిమా 200 కోట్ల మార్కెట్‌ను అందుకోవ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -