Thursday, May 23, 2024
- Advertisement -

150 కోట్ల మార్కెట్‌లో ‘స‌ర్కార్’

- Advertisement -

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన స‌ర్కార్ మూవీ 150 కోట్ల మార్కెట్‌లో చేరింది.స్టార్ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో సినిమా స‌ర్కార్‌.సినిమాపై మొద‌టి నెగిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి వాటిని దాటుకుని సినిమా విజ‌యపథంలో దూసుకుపోతుంది.తాజాగా ఈ సినిమా 150 కోట్ల మార్కెట్ చేరిందని చిత్ర యూనిట్ తెలిపింది.దీనికి సంబంధించిన ఓ పోస్ఠ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

తొలి రెండు రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 150 కోట్ల క్లబ్ లోకి విజయ్ అడుగుపెట్టడం ఇది మూడోసారి. గతంలో ఆయన నటించిన ‘తెరి’ .. మెర్సల్’ సినిమాలు ఈ ఫీట్ ను సాధించాయి. పొలిటికల్ డ్రామా నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా, కొన్ని వివాదాలను ఎదుర్కొంటూనే వుంది. అయినా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -