Thursday, May 16, 2024
- Advertisement -

‘సరైనోడు’ టీజర్‌ వచ్చేసింది!

- Advertisement -

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే ఈ సినిమా టీజర్‌ కొద్ది నిమిషముల ముందే విడుదల అయింది. ఇందులోని ఓ డైలాగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల చేస్తుంది.

ఆ డైలాగ్‌ ఏంటంటే ‘ఎర్ర తోలు కదా స్టైల్‍గా ఉంటాడు అనుకుంటున్నావేమో….మాస్‌, ఊరా మాస్‌’ అనే డైలాగ్ ఇప్పుడు అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఈ టీజర్ తో సినిమా మీద మరింత అంచనాలు పెరిగి పోయాయి. బన్నీ చెప్పే డైలాగ్స్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‍లో ఉంటుందో అర్ధం అవుతుంది. ఐతే తాజా ఓ భారీ సెట్‍లో అల్లు అర్జున్‌, కేధరిన్‌ త్రెసాలపై ఓ పాట షూట్ చేశారు. శ్రీకాంత్, ఆది ముఖ్యపాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాని సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.

{youtube}v=5oonhFB-cpw{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -