Saturday, May 18, 2024
- Advertisement -

మ‌హ‌న‌టి టీజ‌ర్ అంత అద్భుతంగా ఏం లేదు

- Advertisement -

మరో నెల రోజుల్లో జనాల ముందుకు రాబోతున్న మహానటి సినిమా టీజర్ బయటకు వచ్చింది. మ‌హ‌న‌టి సావిత్రి జీవిత క‌థాంశంగా తీసిన సినిమా మ‌హ‌న‌టి టీజ‌ర్ వ‌స్తుంద‌ని బాగానే ప్ర‌చారం చేశారు. జ‌నాలు కూడా టీజ‌ర్ కోసం వెయిట్ చేశారు. టీజ‌ర్ రిలీజ్ అయింది.టీజ‌ర్ చూసిన జ‌నాలు జ‌స్ట్ ఓకే అంటున్నారు. అలనాటి సావిత్రి పాత్రల రీ ప్రొడక్షన్ వరకు టీజర్ బాగానే వుంది. కానీ టీజర్ చూడగానే ‘సూపర్.. అదిరిందిగా’ అనే రెంజ్ కు మాత్రం లేదనే చెప్పాలి.

అయితే ఇది టీజరే కాబట్టి, ఇంతకన్నా ఎక్కువగా చెప్ప లేకపోవచ్చు. గతంలో మహానటి టైటిల్ ను మాయాబజార్ మాయా దర్పణంలో వదిలిన వీడియో బైట్ తో పోల్చుకుంటే, అదే బాగుంది అనిపిస్తుంది.అయితే అలనాటి వాతావరణం రూపకల్పన, సావిత్రిగా కీర్తి సురేష్ మేకప్ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అస‌లు సావిత్రిగా కీర్తీ సురేష్ మెప్పిస్తుందా అనే అనుమానం క‌లుగుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -