Tuesday, May 7, 2024
- Advertisement -

సమంత కట్టుకున్న చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

- Advertisement -
Naga chaitanya, Samantha  Engagement

టాలీవుడ్ లో ప్రేమపక్షులుగా తిరుగుతున్న సమంత, నాగ చైతన్య పెళ్లికి మరో అడుగు దూరంలో ఉన్నారు. ఎప్పట్నుంచో అభిమానులను ఊరిస్తున్న వారి ఎంగేజ్ మెంట్ నిన్న అట్టహాసంగా జరిగింది. కాగా అక్కినేని వారింటి కోడలుగా అడుగుబెట్టనున్న సమంత…

 నిన్న ఎంగేజ్ మెంట్ లో కట్టుకున్న చీర డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ఈ చీరను సమంత కోరిక మేరకు ముంబై డిజైనర్ క్రేషా బజాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ చీరపై సమంత తన ప్రేమకథను డిజైన్ చేయించుకోవడమే ఈ చీరకున్న స్పెషాలిటీ. చీర అంచును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ఈ చీరపై చైతూతో తన తొలి చిత్రం ‘ఏమాయ చేశావే’లోని ఓ సన్నివేశం నుంచి అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫోటో వరకూ డిజైన్ చేయించుకుంది. ఇంకా దీనిపై ఓ బైక్ పై చైతన్యతో కలసి వెళుతున్న చిత్రం కూడా ఉంది. చైతన్యపై తనకెంత ప్రేమ ఉందో ఈ చీరను సమంత డిజైన్ చేయించుకున్న తీరే తెలుపుతోందని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

{youtube}F-QKpPk56pg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -