- Advertisement -

టాలీవుడ్‌లో విషాదం.. సీనియ‌ర్ న‌టుడు మృతి

- Advertisement -

దాదాపు 180 సినిమాల్లో న‌టించిన ఓ సీనియ‌ర్ న‌టుడు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మృతిచెందాడు. ఆయ‌నే వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ (78). హైద‌రాబాద్‌లో ఉంటున్న స‌త్య‌నారాయ‌ణ‌ కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతుండేవాడు. సోమ‌వారం (మార్చి12) ఉదయం మృతిచెందారు.

సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో కూడా సహాయ నటుడిగా స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. సీతామహాలక్ష్మి, అర్థాంగి, శుభలేఖ, విజేత, ఊరికిచ్చిన మాట, శృతిలయలు, శ్రీనివాస కల్యాణం, అత్తవారిల్లు వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన న‌టించిన చివ‌రి సినిమా కారందోశ‌. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌రే సినిమాలు చేయ‌లేదు. ఆయ‌న‌కు ఇద్దరు కుమార్తెలు.స‌త్య‌నారాయ‌ణ నటనతోపాటు బిజినెస్‌లోనూ బిజీగా ఉన్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలో వంకాయల జ్యూయలర్స్‌ పేరుతో నగల దుకాణం నిర్వ‌హిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -