Tuesday, May 7, 2024
- Advertisement -

మొదటి రోజే హీరోయిన్ ని ముద్దు పెట్టమన్నాడట..!

- Advertisement -

‘నువ్విలా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హవీష్ ఇప్పుడు ‘7’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రెహమాన్, రెజీనా కసాండ్రా, నందిత శ్వేత, అదితి ఆర్య, అనీష ఆంబ్రోస్, పూజిత పొన్నాడ మరియు త్రిధా చౌదరి ఈ సినిమా లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ చూస్తే సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న హావిష్ లిప్ లాకుల గురించి రియాక్ట్ అయ్యాడు. షూటింగ్ కి వెళ్ళిన మొదటి రోజే దర్శకుడు తనను ముద్దు సీన్ చేయమన్నాడట “నేను అప్పటి దాకా ఒక్క హీరోయిన్ ని పెట్టుకొని కూడా ముట్టుకోలేదు.

మొదటి రోజే ముద్దు సీన్ చేయడానికి సిద్ధంగా లేను. అదే విషయాన్ని దర్శకుడితో కూడా చెప్పాను. కానీ ఇలా సిగ్గు పడుతూ కూర్చుంటే సినిమా షూటింగ్ పూర్తవదు అని నిర్మాతలను అన్నారు. మొదట జోక్ చేస్తున్నారు అనుకున్నాను కానీ తర్వాత వాళ్లు నన్ను తిడుతున్నారు అని అర్థమైంది(నవ్వుతూ). ఏదేమైనా ముద్దు సీన్ అంటే నాతోపాటు నా కోస్టార్ కూడా అంతే కంఫర్టబుల్ గా ఉండాలి” అని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -