Sunday, April 28, 2024
- Advertisement -

హైకోర్టు తాత్కాలిక న్యాయ‌మూర్తితో సీఎం జ‌గ‌న్ భేటీ..

- Advertisement -

సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవినీతి ర‌హిత పాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఒక ప్ర‌జ‌ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే మ‌రో వైపు అవినీతిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు సిద్ద‌మ‌వ‌తున్నారు. దీనిలో భాగంగానె ఈ రోజు హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌వీణ్ కుమార్ తో భేటీ అయ్యారు. వైజాగ్ పర్యటన ముగించుకుని విజయవాడ తిరిగొచ్చారు. వాస్తవానికి ఈ మధ్నాహ్నం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాల్సి ఉన్నా, తన రాక ఆలస్యం కావడంతో సమీక్షను రద్దు చేసుకున్నారు.

ప్రాజక్టుల కాంట్రాక్టుల విషయంలో పారదర్శకత కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్ప‌టు చేస్తామ‌ని సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నె జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కమిషన్ కోసం హైకోర్టు న్యాయమూర్తి ఒకరిని కేటాయించాలని కోరేందుకే జగన్ ఇవాళ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసినట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ వెంట న్యాయ నిపుణులు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజ‌య్ క‌ల్లాం త‌దిత‌రులున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -