Monday, May 13, 2024
- Advertisement -

పవన్ వర్సెస్ పచ్చ మీడియా….. ఘాటుగా స్పందించిన జగన్

- Advertisement -

చంద్రబాబు పగబడితే, దెబ్బతీయాలని చూస్తే ఎలా ఉంటుందో కొత్తగా చెప్పేదేముంది? నాలుగేళ్ళుగా అభివృద్ధి జోడీ, అద్భుత నాయకుడు అని బిజెపి నాయకులను మించి నమో భజన చేసిన బాబు బృందం….విడిపోయిన రోజుల కాలంలోనే ఏకంగా కొజ్జా అనేస్థాయికి వెళ్ళిపోయింది. అది పెద్ద విలన్‌గా మోడీని చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశారు అనేది నిజం. అయితే బాబుతో మోడీకి మిత్రత్వం ఉన్నంత కాలం పచ్చ బ్యాచ్ జనాలు ఎవ్వరూ ఆ ద్రోహం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఇక మోడీ మనిషేకాదు అనే స్థాయిలో విరుచుకుపడిపోతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే బాబు ప్రయోజనాలో పచ్చ బ్యాచ్‌కి ముఖ్యమైపోయాయి.

ఇదే విషయాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్‌తో పంచుకున్నాడు జగన్. పచ్చ మీడియా మొత్తం కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌ల వ్యక్తిత్వాన్ని ఏ స్థాయిలో విమర్శించిందో చెప్పనవసరం లేదు. పిల్లల పెంపకం నుంచీ తల్లిదండ్రులతో, చెల్లెలు షర్మిలతో జగన్ సంబంధాల వరకూ అన్ని విషయాల్లోనూ జగన్‌ని విలన్‌గా చూపిస్తూ దిగజారుడుతనానికి పరాకాష్టలాంటి వార్తలను పచ్చ మీడియా వండివార్చింది. ఇప్పుడు అదే కుట్రలను పవన్ కళ్యాణ్‌పై చేస్తున్నారు. తాజాగా ఆ విషయాన్ని ఆవేధనతో చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. టిడిపికి పవన్ దూరమవుతాడు అని పసిగట్టిన మరుక్షణం నుంచీ మహేష్ కత్తి, పూనం కౌర్, శ్రీరెడ్డిలాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని బాబు భజన బృందం ఛానల్స్ అన్నీ ఏ స్థాయిలో పవన్‌ని హింసిస్తున్నాయో చెప్పనవసరం లేదు. అందుకే పవన్ కూడా ఆయా ఛానల్స్‌తో పాటు తెరవేనుక ఉండి నడిపిస్తున్న లోకేష్ బృందంపై కూడా విమర్శలతో విరుచుకుపడ్డాడు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించమని జగన్‌ని అడిగాడు ఓ సీనియర్ జర్నలిస్ట్. అయితే జగన్ మాత్రం అధికారికంగా స్పందించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర సమస్యలు అన్నీ డైవర్ట్ అయ్యేలా కావాలనే ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారని……ఇప్పుడు తాను కూడా స్పందిస్తే రాష్ట్ర ప్రయోజనాలు లూప్ లైన్‌లోకి వెళ్ళిపోతాయని చెప్పాడు జగన్. బాబు అధికార యావను వ్యతిరేకించినందుకు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నే నాశనం చేసిన చంద్రబాబు, ఆయన భజన మీడియాలు వేరే ఎవ్వరినైనా ఎందుకు వదులుతాయని ప్రశ్నించాడు జగన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత అయినా మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఆడే డ్రామాలను ప్రజలు తెలుసుకుంటే ఆ తర్వాత బాబు మార్క్ రాజకీయాలకు పుట్టగతులు కూడా ఉండవని చెప్పుకొచ్చాడు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -