Saturday, May 18, 2024
- Advertisement -

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ ఎవరు ?

- Advertisement -

ఎప్పుడూ బాలీవుడ్ ని ఖాన్ త్రయం ఏలుతూ ఉంటుంది. ముగ్గురు ఖాన్స్ కీ ఎప్పుడూ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ సినిమా కాకపోతే మరొక సినిమా ఆ సినిమా కాక పోతే ఇంకేదో సినిమా తో ఒకరిమీద ఒకరు గట్టి పోటీ ఇస్తూ ముందుకుసాగుతారు . మొన్నటికి మొన్న ఆమిర్ ఖాన్ ని ముగ్గురు ఖన్స్ లో ఎవరు బెస్ట్ చెప్పండి అంటే ” నాదేముంది చిన్నోడ్ని ” అన్నాడు అతను. షారూఖ్ ని ఇదే ప్రశ్న అడిగితే అతను కూడా ఇలాగే సమాధానం చెప్పాడు.

ఇక సల్మాన్ మ్డియా తో మాట్లాడి కూడా చాలా కాలం అయ్యింది. నిజానికి ఈ ముగ్గురూ చెబుతున్న ఈ విషయాలన్నీ మనం నమ్మొచ్చా? అసలు వీళ్ళు చెబుతున్న ఈ సింపుల్ మాటలన్నీ కేవలం సోదే అని మీడియాలోని చాలామంది క్రిటిక్స్ ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? సంవత్సరానికి దాదాపు 300 కోట్లు సంపాదిస్తున్నాడు షారూఖ్ ఖాన్. కాకపోతే తీసే సినిమాలన్నీ కూడా రొటీన్ మసాలా మూవీసే.

ఇక చారిటీ ఏమన్నా చేస్తున్నాడో లేదో తెలియదు. వినూత్నంగా సినిమాలను తీస్తూ.. దాదాపు తన సినిమాలన్నీ తానే ప్రొడ్యూస్ చేసుకుంటూ.. అదో రేంజ్ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు అమీర్ ఖాన్. తనకు నచ్చని నటుడిని కాని.. తన మీద పంచ్ వేసిన హీరోయిన్ ను కాని తన సినిమాలో పెట్టుకోకపోవడం మాత్రమే కాదు.. తన సినిమా ప్రీమియర్ కు కూడా పిలువడు. ఇక సల్లూ భాయ్ గురించి పెద్దగా మనం చెప్పేదేముంది. 20 కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఒకే ఒక్క రేప్ కామెంట్ తో సుల్తాన్ సినిమాకు కావల్సినంత వచ్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -