Wednesday, May 8, 2024
- Advertisement -

శీలవతి’గా ష‌కీలా వ‌చ్చేస్తోంది!

- Advertisement -

తెలుగు, మ‌ళ‌యాలం, త‌మిళంలో బి గ్రేడ్ సినిమాలతో పాపులర్ అయిన న‌టి షకీలా. కుర్రకారు ర‌సం పిండిన‌.. నియంత్రించుకోలేక చేసిన న‌టి ఈమె. ఈమె కొన్ని ఏళ్లుగా సినిమాల‌కు దూర‌మైంది. ఈమె సినిమాలు రాకా చాలా సంవ‌త్స‌రాలు అవుతోంది. మలయాళంలో ఈమె సినిమాలకు మార్కెట్ పెద్ద‌దే. ఎంత పెద్ద స్టార్ సినిమా వచ్చినా అందరు షకీలా సినిమా కోసం వెళ్లేవారు. తన అందంతో అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు కూడా షకీలా భయాన్ని పుట్టించింది.

సినిమాల్లో విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ.. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. అయితే ఆమె ఇప్పటివ‌ర‌కు దాదాపు 249 సినిమాలు చేశారంట‌. ఇప్పుడు 250 సినిమా చేస్తున్నారు. చాలారోజుల తరువాత షకీలా మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమ‌య్యారు. ఆ సినిమా ఆమెకు 250వ చిత్రం కావడం విశేషం.

కేరళలో జరిగిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా సినిమాను దర్శకుడు సాయిరాం దాసరి తీస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తీస్తున్న ఈ సినిమాకు `శీల‌వ‌తి` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఇటీవ‌ల విడుద‌ల చేసింది. మన స్టార్లు ఇక్కడ 25వ సినిమా.. 100వ సినిమా.. 150వ సినిమా అంటుంటే.. షకీలా కూడా అదే పందాలో వెళ్ళి 250 నాట్ ఔట్ అంటోంది. ఈవిడ చేసిన సినిమాలను ఇప్పుడు కౌంటింగ్ కూడా చేసే అభిమానులు ఉన్నారో లేదో తెలియదు కాని.. 250 సినిమాలంటే మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -