Saturday, May 18, 2024
- Advertisement -

పాన్ ఇండియా మూవీగా శక్తిమాన్

- Advertisement -

90ల్లో బుల్లితెర ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన సీరియల్ శక్తిమాన్. ముఖేష్ కన్నా శక్తిమాన్‌గా.. నటించిన ఈ ధారావాహిన అప్పట్లో దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శక్తిమాన్ చేసిన సాహసాలు చిన్నారులను ఎంతగానో ఉత్తేజపరిచేవి. కేవలం గ్రాఫిక్స్ తోనే కాకుండా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా శక్తిమాన్ ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ వెండితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ గత ఏడాది నుంచి శక్తిమాన్ ప్రాజెక్టుపై బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేయించారట.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితలు ఆ స్క్రిప్ట్ కోసం పని చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక భాషలోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా మూడు పార్ట్ లు కథను సిద్ధం చేసి ఉంచారట. సినిమాను విదేశీ భాషల్లోకి అనువాదం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే శక్తిమాన్ సిరీస్ ను సినిమాగా తెరపైకి తీసుకు వస్తే అందులో హీరోగా ఎవరు నటిస్తాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సోనీ పిక్చర్స్ అయితే ఎక్కువగా టాలీవుడ్ హీరోలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదివరకే బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ వంటి హీరోలు క్రిష్ లాంటి సూపర్ హీరో ప్రాజెక్టులను చేశారు. అయితే ఆయనకు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా మార్కెట్ లేదు.

కాబట్టి సోనీ పిక్చర్స్ బాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. తెలుగు హీరోల విషయానికి వస్తే దాదాపు అగ్ర హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే పాన్ వరల్డ్ అనే స్థాయికి చేరుకుంటున్నారు. దాంతో సోనీ పిక్చర్స్ మొదట ప్రభాస్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రభాస్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా చాలా బిజీగా ఉండడంతో అతనికి కుదరకపోవచ్చు అనే అనుమానం కలుగుతోంది. అల్లు అర్జున్ తో కూడా సోనీ పిక్చర్స్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల నెట్ కలెక్షన్ అందుకోవడం విశేషం. దాంతో ఈ ఇరువురిలో సోనీ పిక్చర్స్ ఎవరినైనా ఎంపిక చేస్తుందా ? లేక మరో హీరో ఎవరినైనా సంప్రదిస్తుందా అన్న వేచి చూడాలి.

Also Read: వివాదాస్పద సెలబ్రిటీలతో కంగనా లాక్‌అప్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -