Sunday, May 5, 2024
- Advertisement -

డీజే టిల్లు ఎలా ఉందంటే ..?

- Advertisement -

పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రం డీజే టిల్లు. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి సినిమా ఎలా ఉంది ? తెలుసుకుందా పదండి .. డీజే టిల్లు చిత్ర క‌థ బాల గంగాధర తిలక్ అలియాస్ డిజే టిల్లు మాస్ ఎంట్రీ తో మొదలవుతుంది. టిల్లు లైఫ్ హ్యాపీ గా ఎంజాయ్ చేస్తుంటాడు. అలా ఒకానొక సమయంలో రాధికని చూసి ప్రేమలో పడుతాడు.

అంతా సాఫీగా జరుగుతుంది అని అనుకునే లోపే రాధిక తన బాయ్ ఫ్రెండ్ ని మర్డర్ చేసిన సీన్ లో బుక్ అయ్యి ఎలాగైనా ఈ సమస్య నుంచి బయట పడేయమని టిల్లు సాయం కోరుతుంది. గాళ్‌ ఫ్రెండ్ కోసం టిల్లు ఏం చేస్తాడు? రాధిక‌ని స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డేశాడా? వీటన్నిటి మధ్య ప్రిన్స్ క్యారెక్టర్ ఎలా సాగుతుంది ? టిల్లు – రాధిక సెకండ్ హాఫ్ లో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ? చివరికి ఏ జరిగిందనేది మిగిలిన కథ. సిద్ధూ జొన్నలగడ్డ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. అతని డైలాగ్ డెలివరీ, స్లాంగ్ యూత్‌ని ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. నేహా శెట్టి కూడా బాగానే నటించింది. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ సహాయక పాత్రలు పోషించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీను నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు, ఎడిటింగ్ నవీన్ నూలి హ్యాండిల్ చేశారు. చిత్రంలో సంగీతం అదనపు ఆకర్షణ. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కామెడీ రూపంలో బాగా చెప్పించారు. సెకండాఫ్ పై మరింత దృష్టి పెట్టాల్సింది. అయితే, కుటుంబం అంతా కలిసి ఓసారి ఈ సినిమాని చూడవచ్చు.

Also Read: పెళ్లి పై అలియా భట్ షాకింగ్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -