Monday, May 13, 2024
- Advertisement -

శర్వానంద్ – కళ్యాణి ప్రియదర్శన్ ల పెళ్లి పాట

- Advertisement -

‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో శర్వానంద్ ఇప్పుడు సుధీర్వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కాజల్ అగర్వాల్ మరియు కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ తోనే ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించిన దర్శకనిర్మాతలు తాజాగా ఈ సినిమా నుంచి ‘సీతాకళ్యాణం’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సినిమాలో శర్వానంద్ మరియు కల్యాణీ ప్రియదర్శన్ పెళ్లి జరుగుతున్నప్పుడు వస్తుంది అని అర్థం అవుతోంది.

ఇక ఈ పాటలో శర్వానంద్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ల కెమిస్ట్రీ హైలైట్ గా మారబోతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పాట ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రశాంత్ పిళ్ళై అందించిన సంగీతం చాలా బాగుంది. శ్రీహరి కె గొంతు మరియు బాలాజీ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో శర్వా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -