Thursday, May 16, 2024
- Advertisement -

అప్ఘ‌న్ ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించిన విండీస్‌….

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా విండీస్‌, ఆప్ఘ‌న్ మ‌ధ్య జ‌రిగిన నామ‌మాత్ర‌పు మ్యాచ్‌లో వెండీస్ మొద‌ట త‌డ‌బ‌డినా త‌ర్వాత భారీ స్కోరు న‌మోదు చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో విండీస్ 6 వికెట్ల న‌ష్టానికి 311 ప‌రుగులు చేసింది. మొద‌ట టాస్ గెలిచ‌న ఇండీస్ కెప్టెన్ హోల్డ‌ర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

విండీస్ బ్యాట్స్‌మెన్లలో షై హోప్ (92 బంతుల్లో 77 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎవిన్ లూయీస్ (78 బంతుల్లో 58 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలాస్ పూరన్ (43 బంతుల్లో 58 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ఆఫ్గన్ బౌలర్లలో దావ్లాత్ జద్రాన్ 2 వికెట్లు పడగొట్టగా, సయిద్ షిర్జాద్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లు తలా 1 వికెట్ తీశారు.

కెరీర్‌లో చివరి వన్డే ప్రపంచకప్‌ ఆడుతున్న క్రిస్‌గేల్ (7: 18 బంతుల్లో 1×4) మరోసారి అభిమానుల్ని నిరాశపరుస్తూ సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత మ‌య్యారు. హెట్‌మెయర్ (39: 31 బంతుల్లో 3×4, 2×6) భారీ షాట్లు ఆడుతూ ఔటైపోయాడు. కానీ.. నికోలస్ పూరన్ మరోసారి బాధ్యతాయుత అర్ధశతకంతో జట్టు స్కోరు బోర్డు వేగాన్ని కొనసాగించాడు. ఇక ఆఖర్లో కెప్టెన్ జేసన్ హోల్డర్ (45: 34 బంతుల్లో 1×4, 4×6) వరుస సిక్సర్లు బాదడంతో వెస్టిండీస్ 311 పరుగులు చేయగలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -