Sunday, April 28, 2024
- Advertisement -

శర్వా 35,36,37..ఫ్యాన్స్‌కి పండగే!

- Advertisement -

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. శర్వా బర్త్ డే సందర్భంగా అదిరే ట్రీట్ ఇచ్చారు. ఒకేరోజు మూడు సినిమాలను అనౌన్స్ చేశారు. ఇక శర్వా 35వ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాకు మనమే అనే టైటిల్ ఖరారు చేయగా ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.

ఇక శర్వా 36వ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడులను అందించిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మూడు తరాల కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన కథగా తెరకెక్కగా లవ్, డ్రీమ్స్ ప్రధానాంశంగా తెరకెక్కనుంది.

శర్వా 37వ సినిమాకు డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనుండగా అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -