Monday, May 20, 2024
- Advertisement -

సీఎం రేవంత్‌కు షాక్…

- Advertisement -

సీఎం రేవంత్‌కు తొలి షాక్ తగిలింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ అమోదించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది.

మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని…దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేగాదు మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని …మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్‌కు తెలపాలని చెప్పింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్, సత్యనారాయణలను ప్రతిపాదించగా గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. అనంతరం కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లకు ఓకే చెప్పగా దీనిని సవాల్ చేస్తూ దాసోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -