Wednesday, May 8, 2024
- Advertisement -

కొత్త పోస్ట‌ర్ వ‌దిలిన శ‌ర్వానంద్‌.. బొమ్మ అదిరిందిగా!

- Advertisement -

హీరో శ‌ర్వానంద్ వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం పడి పడి లేచే మనసు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి న‌టిస్తుంది. హను రాఘవపూడి ప్రేమ క‌థ‌ల‌ను చక్కగా తెర‌కెక్కిస్తాడు అనే పేరుంది. అందాల రాక్షసి – కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతోనే రుజువైంది. అయితే ఆయ‌న రూటు మార్చి తీసిన లై సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో మ‌ళ్లీ త‌న‌కు క‌లిసి వ‌చ్చిన ప్రేమ‌క‌థ‌నే న‌మ్ముకుని సినిమా చేస్తున్నాడు.

తాజాగా పడి పడి లేచే మనసు సినిమాలో కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. అందులో సాయిపల్లవి – శర్వానంద్ చేతిలో చెయ్యేసుకొని కనిపిస్తున్నారు. ఈ స్టిల్ చూడగానే కెమిస్ట్రీ ఏ రేంజిలో పండుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం శర్వానంద్ తన హెయిర్ స్టైల్ ని మార్చేసి – కొత్తగా కనిపిస్తున్నాడు.సినిమాని వినాయ‌క చ‌వితికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -