Monday, May 20, 2024
- Advertisement -

అవ‌కాశాల కోసం అందాల ఆరబోత‌

- Advertisement -

ఏ సినీ ప‌రిశ్ర‌మ‌లోనైనా హీరోయిన్ కాలం ఓ ప‌దేళ్ల పాటు ఉండ‌డం చాలా క‌ష్టం. ప‌దేళ్ల‌ల్లో వీలైన‌న్ని సినిమాలు చేసుకుంటూ పోతేనే అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవ‌చ్చు. మంచి సినిమాలు, మంచి పాత్ర‌లే ఎంపిక చేసుకుని సంవ‌త్స‌రానికి ఒక‌టి రెండు సినిమాలు చేస్తానంటే క‌ష్ట‌మే. అలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన్న హీరోయిన్లు చాలానే ఉన్నారు. ఆచితూచి సినిమాలు చేసే హీరోయిన్లు ఎక్కువ‌గా మ‌నుగ‌డ‌లో లేర‌ని సినీ చ‌రిత్రే చెబుతోంది.

ఇప్పుడు అవ‌కాశాలు రాక అప్ప‌టి హీరోయిన్లు క‌ల‌త చెందుతున్నారు. ఎలాగైనా అవ‌కాశాలు తెచ్చుకోవాల‌నే ఆశ‌తో ఒక అడుగు ముందుకు వేసి అందాలు ఆర‌బోస్తున్నారు. తాము ఇంత‌కుముందు చేయ‌ని ప‌నిని ఇప్పుడు చేస్తున్నారు. అందాల‌తోనైనా సినీ ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించాల‌ని భావిస్తున్నారు. అదే విధంగా ఇప్ప‌టిదాక ఇద్ద‌రు, ముగ్గురు చేశారు. గతంలో ఫుల్ బిజీగా ఉంటూ చాలా చిత్రాల్లో నటించిన ఓ హీరోయిన్‌కు ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేదు. తెలుగులో కూడా ఒకసారి అలా వచ్చిపోయింది. అప్పట్లో ఫాషన్ షోలతో, డాన్స్ ప్రదర్శనలతో బిజీబిజీగా కనిపించిన హీరోయిన్ నేడు ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఆ భామే షెర్లిన్ చోప్రా.

‘ఏ ఫిలిం బై అరవింద్’ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చిన షెర్లిన్ చోప్రా త‌ర్వాత ఒక్క సినిమాలో కూడా న‌టించ‌లేదు. మొదటి చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అమ్మడికి మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ అంతంతే. ఇప్పుడు అవ‌కాశాల కోసం అందంగా కనిపిస్తూ, హాట్ హాట్ క్లీవేజ్ అందాలు చూపిస్తోంది. ప్రస్తుతం ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -