Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌బ్లిగ్గా రొమాన్స్ చేస్తున్న జంట‌..!

- Advertisement -

బాలీవుడ్‌లో ల‌వ్ ఎఫైర్స్ అనేది సర్వ సాధార‌ణం. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ అలా ల‌వ్ ప‌డుతుంటారు. ఇలా బ్రేక‌ప్ చెప్పి విడిపోతుంటారు. బాలీవుడ్‌లో ఎంత‌మంది ఉన్న ఫర్హాన్ అఖ్తర్ తీరు మాత్రం అంద‌రికి భిన్నంగా ఉంటుంది. దర్శకుడిగా.. నిర్మాతగా.. హీరోగా.. సింగర్ గా ఇలా అన్నీ రకాలుగా తన సత్తా చాటాడు. ఫర్హాన్ మూడేళ్ళ క్రితం తన భార్య అధున కు విడాకు ఇచ్చాడు. ఈ జంటకుఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంద‌మైన హీరోయిన్స్‌తో మ‌నోడు తెగ ఎంజాయ్ చేస్తుంటాడు.

45 ఏళ్ల వ‌య‌స్సులో కూడా యంగ్ హీరోయిన్స్‌తో ఎఫైర్ న‌డుపుతుంటాడు. గ‌తంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్‌తో కొంతకాలం ఎఫైర్ న‌డిపాడు. త‌రువాత వీరిద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు రావ‌డంతో ఫర్హాన్ అఖ్తర్‌తో విడిపోయింది శ్ర‌ద్ధా క‌పూర్‌. ఆ వెంట‌నే వేరే భామ‌ను లైన్లో పెట్టాడు ఫర్హాన్ అఖ్తర్‌. బాలీవుడ్ నటి షిబాని దండేకర్‌తో ఘ‌డ‌మైన ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఎక్క‌డ చూసిన వీరిద్ద‌రే క‌నిపిస్తున్నారు. ప‌బ్‌లు , పార్టీలు రెస్టారెంట్‌లు ఎక్క‌డ చూసిన ఈ జంటే క‌నువిందు చేస్తోంది. ఈ జంట వెకేషన్ కోసం మెక్సికోకు వెళ్లారట.

అక్కడ ఇద్దరూ బీచిలో తెగ రొమాన్స్ చేసుకున్నార‌ట‌. దీనికి సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో ఫర్హాన్ అఖ్తర్ షిబానిని వెనుక నుంచి గట్టిగా కౌగిలించుకుని త‌న తన బాహువుల్లో బంధించాడు. అఖ్తర్ కౌగిలిని త‌ట్టుకోలేక అదోరకం ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మ‌రి ఈ భామ‌ను అయిన అఖ్తర్ పెళ్లి చేసుకుంటాడో లేక కేవలం ఎంజాయ్ చేయ‌డానికి ప‌రిమితం చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -