Monday, April 29, 2024
- Advertisement -

పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన శృతి హాస‌న్‌

- Advertisement -

శృతి హాస‌న్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి తన‌ను తాను నిరుపించుకుంటుంది. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఎంట్రీ ఇచ్చింది శృతి హాస‌న్‌. ఆ త‌రువాత త‌క్కువ కాలంలోనే తండ్రికి త‌గ్గ కూతురిగా ఎదిగింది. తెలుగు, త‌మిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో న‌టించింది శృతి హాస‌న్‌. గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న శృతి ఇటీవ‌లే మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తుంది. శృతి హాసన్‌ పొలిటిక‌ల్ ఎంట్రీపై సోష‌ల్ మీడియాతో ర‌క‌రకాల వార్త‌లు వినిపిస్తున్నాయి. తండ్రి కమల్ హాసన్ మక్కల్ నిధి మయ్యమ్ పార్టీ పెట్టిన సంగ‌తి తెలిసిందే.

త‌మిళ‌నాడు లోక‌స‌భ ఎన్నిక‌ల‌కు క‌మ‌ల్ పార్టీ రెడీ అవుతోంది. దీంతో క‌మ‌ల్‌కు మ‌ద్దతుగా శృతి హాస‌న్ ప్ర‌చారం చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. శృతి తండ్రి పార్టీకి మద్దతు ఇస్తానను చెప్పింది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా పార్టీకి బ్యాక్ గ్రౌండ్ నుంచి తనదైన సలహాలు ప్రణాళికలు అందిస్తుందట. తన తండ్రి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే జనాలకు మంచి జరుగుతుందని శృతి వివరణ ఇచ్చింది. పార్టీపై గ్రౌండ్ లెవెల్లో ప్రణాళికలు ర‌చిస్తుంద‌ట శృతి.తండ్రితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు శృతి సిద్ధంగా ఉందట. మరి శృతి స‌హకారంతో క‌మ‌ల్ పార్టీ ఏ మేర‌కు రాణిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -