ఒకప్పుడు బాలీవుడ్‌లో తన అందాలతో కనువిందు చేసింది. ఆ ముద్దుగుమ్మ పేరు వింటేనే చాలు కుర్రాళ్లు పడి చచ్చిపోయేవాళ్లు. వయసు మీద పడటంతో సినిమాలకు దూరమైన బుల్లితెరపై డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఆమె శిల్పాశెట్టి. 48 ఏళ్ల వయసులోనూ 21 ఏళ్ల అమ్మాయిలా ఫిజిక్ మెంటేన్ చేస్తూ ఔరా అనిపిస్తోంది.
తాజాగా ఎల్లోరా శిల్పంలా ఎల్లో కలర్ సారీలో మెరిసిపోయింది శిల్పా. వయసు కేవలం నెంబర్ మాత్రమేనని తన అందచందాలను ప్రదర్శించి అహో అనిపించింది.ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్ చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా మూవీగా రానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శిల్పాశెట్టి పాల్గొని సందడి చేసింది. హీరో రవితేజతో కలిసి స్టెప్పులేసి ఇరగదీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా శిల్పా అందచందాలకు మంత్రముగ్దులవుతున్నారు అంతా.
