Saturday, May 18, 2024
- Advertisement -

షర్మిల సంచలనం..ఎన్నికల బరిలో బ్రదర్ అనిల్!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గుచూపారు వైఎస్ షర్మిల. ఇవాళ లోటస్‌ పౌండ్‌లో షర్మిల అధ్యక్షతన జరిగిన వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర స్ధాయి కార్యవర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల బరిలో తనతో పాటు బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేస్తారని తెలిపారు.

ఇక తాను పాలేరుతో పాటు మరో నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదని అనుకున్నామని ..కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆలోచించామని వెల్లడించారు. అందుకే కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని కానీ ఆ పార్టీ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఒంటరిపోరుకే సిద్ధమయ్యామని వెల్లడించారు షర్మిల.

మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తాను 2 చోట్ల పోటీ చేస్తానని తెలిపారు. ఇక కాంగ్రెస్ తో కలిసి ప్రొ.కోదండరామ్ పార్టీ టీజేఎస్ పోటీ చేయనుంది. కోదండరామ్ కోసమే షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం వద్దనుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్న షర్మిల ఏ మేర ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. ఇక నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -