Tuesday, April 30, 2024
- Advertisement -

కెప్టెన్సీలో ధోనీ-కోహ్లీకి మ‌ధ్య తేడా ఇదే…

- Advertisement -

భారత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ చాలా కూల్‌గా టీమిండియానువిజ‌య‌ప‌థంలో న‌డిపించాడు గ‌తంలో. కాని ఇప్పుడు కోహ్లీ మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని దక్షిణాఫ్రికా జట్టు మాజీ కోచ్ రే జెన్నింగ్స్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు వన్డేల్లోనూ ఘన విజయం సాధించిన భారత్.. మూడో వన్డే కేప్‌టౌన్ వేదికగా బుధవారం ఆడనుంది.

రెండు వ‌న్డేల్లోనూ బ్యాట్‌తో రాణిస్తున్న విరాట్ కోహ్లి తొలి వన్డేలో శతకం, రెండో వన్డేలో చివరి వరకూ క్రీజులో అజేయంగా నిలిచి జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. కానీ.. అతని దూకుడు జట్టు‌లోని ఆటగాళ్లని ఆందోళనలోకి నెడుతోందని ఒకప్పుడు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కోచ్‌గా పనిచేసిన జెన్నింగ్స్‌ అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఇంకా పరిణతి సాధించలేదు. మహేంద్రసింగ్ ధోనీ నుంచి కోహ్లికి కెప్టెన్సీ మార్పు.. టీమిండియాపై ప్రభావం చూపుతోంది. ఎందుకంటే.. ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ జట్టుని నడిపిస్తాడు. కానీ.. విరాట్ కోహ్లి మాత్రం ధోనీకి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అతని దూకుడు డ్రెస్సింగ్‌ రూములో ఆటగాళ్లు భయపడే స్థాయిలో ఉంటోంది.

ముఖ్యంగా యువ క్రికెటర్లు టీమిండియాలోకి వస్తున్న ఈ తరుణంలో అతని ప్రవర్తన వారి ఆత్మవిశ్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి.. విరాట్ కోహ్లి మంచి నాయకుడిగా ఎదిగేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్‌లో ఎవరో ఒకరు చొరవ చూపాలి’ అని జెన్నింగ్స్‌ సూచించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -