Saturday, May 4, 2024
- Advertisement -

చిరు..నిజంగా మెగాస్టారే!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు నటుడు శివాజీ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తనకు చేసిన సాయం గురించి చెప్పుకొచ్చాడు.మాస్టర్ సినిమా చేసేటప్పుడు ఆయనకు నేను ఒక అభిమానిగా, ఒక ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసని… ఫుల్ జోష్ లో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నా దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి డబ్బుల్లేవు.

ఈ విషయంలో చిరంజీవితో ఎవరో చెప్పగా వెంటనే నా దగ్గరికి వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి సాయం చేశారన్నారు. ఆ పదివేలతో సంవత్సరం వరకు రెంట్‌కు ఇబ్బంది రాలేదనన్నారు. అప్పటికి నేను ఆయనకు అంతగా తెలీదు… ఆ సినిమాలోనే పరిచయం. అయినా నా కోసం ఆయన అంత చేశారు…చిరు నిజంగా మెగాస్టార్ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ వ్యక్తులకు, అభిమానులకు ఎంతోమందికి సహాయం చేశారు. కానీ దానిని ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పుకోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -