Saturday, May 4, 2024
- Advertisement -

కల్కి రిలీజ్‌పై క్లారిటీ వచ్చేనా!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,దిశా పటాని, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ అయినా ప్రేక్షకులు వైరల్ చేసేస్తున్నారు. ఇక ఇవాళ సినిమాలో అమితాబ్ బచ్చన్‌ని సంబంధించిన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. గుజరాత్, పంజాబ్ కింగ్ మ్యాచ్ లో అమితాబ్ లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ లుక్ ఎలా ఉండనుందా అని అంతా ఇంట్రెస్టింగ్‌ ఎదురుచూస్తున్నారు.

కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తుండగా తన పాత్ర అందరికి నచ్చుతుందని ఇప్పటికే కమల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక కల్కి జూన్‌లో రిలీజ్ కానుందని తెలుస్తోండగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారా లేదా అన్న ది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -