Friday, May 17, 2024
- Advertisement -

ఈ హీరో చేతిలో ముప్పై సినిమాలున్నాయ్…!

- Advertisement -

దక్షిణాదినే కాదు.. బాలీవుడ్, హాలీవుడ్ ఇంకా ప్రపంచంలోని అన్ని సినీరంగాలనూ పరిశీంచి వచ్చినా ప్రస్తుతానికి శివరాజ్ కుమార్ వంటి హీరో మరొకరు కనపడరు. ఈ హీరో చేతిలో ఉన్నన్ని సినిమాలు మరో హీరో చేతి లో లేవు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకండా ముప్పై సినిమాల ప్రతిపాదనలున్నాయనట శివరాజ్ కుమార్ చేతిలో.

రాబోయే పది సంవత్సరాల వరకూ ఈ సినిమాలతో శివరాజ్ కుమార్ బిజీగా గడిపేయనున్నాడని తెలుస్తోంది. శాండల్ వుడ్ లో సూపర్ స్టార్ స్టేటస్ లో ఉన్నాడు శివరాజ్ కుమార్. అలనాటి స్టార్ రాజ్ కుమార్ వారసుడిగా తెరపైకి వచ్చిన శివన్నకు వయసు మీద పడుతున్నా నటనాపటిమ, అభిమానుల ఆదరాభిమానాలకు మాత్రం లోటు లేదు. 

ఇటీవలే చిన్న ఆరోగ్య సమస్యతో హాస్పిటలైజ్ అయిన ఈ హీరో… ఎలాంటి బ్రేకూ లేకుండా సినిమాలతో మాత్రం దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధం అవుతున్న దశలోనే పది సినిమాలున్నాయట. 

వీటన్నింటినీ ఈ స్టార్ హీరో ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ పూర్తి కాకుండానే మరిన్ని సినిమాలను పూర్తి చేయాలని శివరాజ్ కుమార్ భావిస్తున్నాడట., అందుకోసం మరిన్ని స్క్రిప్ట్ లను కూడా తయారు చేయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వాటన్నింటి సంఖ్య కలిసి ముప్పైకి చేరిందని.. వీటిని రానున్న పది సంవత్సరాల్లో శివన్న పూర్తి చేసే అవకాశం ఉందని శాండల్ వుడ్ సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -