Tuesday, April 30, 2024
- Advertisement -

అల్లు క్యాంప్ ఫెయిల్…. బన్నీకి సూపర్ షాక్…… కొరటాల శివను పట్టేసిన ప్రభాస్

- Advertisement -

రామ్ చరణ్, మహేష్‌బాబులు వాళ్ళ రేంజ్‌ని పెంచుకునే స్థాయి హిట్స్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా హిట్ అయితే తన రేంజ్‌ని మించిన హిట్ ఇవ్వడం ఖాయం. అందుకే అల్లు అర్జున్ కూడా ఆ స్థాయి హిట్ కోసం కొరటాల శివను లైన్‌లో పెట్టాడు. నిజానికి భరత్ అనే నేను సినిమా యావరేజ్‌గా ఉన్నప్పటికీ కొరటాల ఇమేజ్, మార్కెటింగ్ టెక్నిక్ పుణ్యమాని సినిమా నెక్ట్స్ లెవెల్‌లో నిలబడింది. అందుకే అల్లు క్యాంప్ హెడ్ అల్లు అరవింద్ ప్రత్యేకంగా కొరటాలకు టచ్‌లోకి వెళ్ళి తర్వాత సినిమా అల్లు అర్జున్‌తో చేసేలా ఒప్పించాడు. నాపేరు సూర్య……నా ఇల్లు ఇండియా కమర్షియల్‌గా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందనే విషయంలో అల్లు క్యాంప్‌కి అనుమానాలు ఉన్నాయి. అయితే మంచి పేరు రావడం అయితే ఖాయం అని చెప్తున్నారు.

అందుకే తర్వాత చేయబోయే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉండాలని అల్లు అర్జున్ ప్లాన్ చేశాడు. అసలే ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్‌లు రాజమౌళి సినిమా కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, మహేష్‌లతో సమానంగా నిలబడాలంటే బన్నీకి ఓ స్థాయి బ్లాక్ బస్టర్ మస్ట్‌గా కావాలి. అందుకే కొరటాల శివను ఒప్పించుకున్నాడు. అయితే సడన్‌గా సీన్‌లోకి ఎంటర్ అయిన ప్రభాస్ మొత్తం సీన్ మారిపోయేలా చేశాడు. మిర్చి సినిమాతో కొరటాల శివను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేసింది ప్రభాసే అన్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ నిలబెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు కొరటాల లాంటి సూపర్ క్రేజ్ ఉన్న డైరెక్టర్‌తో వర్క్ చేయాలని భావిస్తున్నాడు ప్రభాస్. అందుకే కొరటాల శివతో సినిమా చేయాలన్న ఇంట్రెస్ట్ బయటపెట్టాడని తెలుస్తోంది. అది కూడా కొరటాలతో మొదటి నుంచీ ట్రావెల్ అవుతున్న సుధాకరరెడ్డితో కలిసి యూవీ క్రియేషన్స్ బేనర్‌పై ఆ సినిమా తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. తనకు డైరెక్టర్‌గా లైఫ్ ఇచ్చినవాడు కావడంతో కొరటాల కూడా ప్రభాస్‌తో సినిమా చేయడానికే మొగ్గు చూపడం ఖాయమన్నది ఇండస్ట్రీ ఖబర్. అల్లు అర్జున్-ప్రభాస్‌లు సన్నిహిత మిత్రులే అయిన నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఏమైనా అండర్‌స్టాండింగ్‌కి వచ్చేలా కొరటాలతో సినిమాలు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉందని అల్లు క్యాంప్ జనాలు చెప్తున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్‌ హాట్ కేక్ డైరెక్టర్ అయిన కొరటాల తర్వాతి అడుగులు ఎలా ఉంటాయో చూడాలిమరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -