Thursday, April 25, 2024
- Advertisement -

బిగ్‌బాస్ త‌నీష్‌కు షాక్‌

- Advertisement -

బిగ్‌బాస్ ద్వారా బాగా పాపుల‌ర్ పొంద‌వచ్చ‌ని భావించాడు హీరో తనీష్‌.కాని సీన్ రివ‌ర్స్ అయింది.మ‌నోడి ప్ర‌వ‌ర్త‌న‌తో ఉన్న ఫ్యాన్స్ కూడా దూరం జ‌రిగారు.ఈ షో ద్వారా త‌న‌కు అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భ‌వించిన త‌నీష్‌కు నిరాశే ఎదురైంది.త‌నీష్ హీరోగా న‌టించిన ‘రంగు’ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తనీష్ ‘లారా’ అనే రౌడీ షీటర్ గా కనిపించనున్నాడు. విజయవాడలో పవన్ కుమార్ అనే వ్యక్తి లారా అనే పేరుతో రౌడీషీటర్ గా మారాడు. అతడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు వివాదం నెలకొంది. లారా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ సినిమా విడుదల కానువ్వమని అంటున్నారు.

లారా కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ”ఏడాది క్రితం లారా(పవన్ కుమార్) గురించి సమాచారం సేకరించడానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ చూశాం. లారాని చంపెయ్యాలి అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. లారాపై అన్యాయంగా రౌడీషీటర్ అనే ముద్ర వేశారని అంటూన్నారు అత‌ని కుటంబ స‌భ్యులు.సినిమాని మాకు చూపించి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించాలి. లేదంటే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఎంతవరకైనా వెళ్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాపై తనీష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. చివ‌రికి ఈ సినిమా ఏం అవుతుందో అని అందోళన చెందుతున్నాడు తనీష్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -