Sunday, May 19, 2024
- Advertisement -

కార్తీక మాసం ముఖ్య ఉద్దేశంలో ఏంటో తెలుసా…?

- Advertisement -

కార్తీక మాసంలో వ‌చ్చే ప్ర‌తి సోమ‌వారానికి చాలా విలువ ఉంటుంది.ఈ మాసంలో దీపాలకు ఉండే విలువ అంత ఇంత కాదు.మిగిలిన కాలంలో ఇంట్లోనే దీపాలు పెడతారు.కాని కార్తీక మాసంలో ఇంట్లోతో పాటు బ‌య‌ట కూడా దీపాలు వెలిగిస్తారు.ఈ మాసంలో భ‌క్తులు నిత్యం శివ నామ‌స్మ‌ర‌ణ చేస్తుంటారు.కార్తీక మాసానికి ఓ ప్ర‌త్యేక‌త కూడా ఉంది.శివుడితో పాటు ,విష్ణువుని కూడా ఈ మాసంలో భ‌క్తికోటి యావ‌త్తు నిష్ట‌తో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజిస్తారు.కార్తీక మాసంలో చేసే స్నాన,ధ్యాన జాపాలు వ‌ల్ల విశిష్ట పుణ్యం ల‌భిస్తుంది.అయితే రోజు ఈ పూజలు చేయ‌లేని వారు క‌నీసం ఏకాద‌శి,ద్వాద‌శి.,పౌర్ణ‌మి సోమ‌వారాల‌లో లేదా ఒక పౌర్ణ‌మి సోమ‌వారల‌లో అయిన నియ‌మ నిష్ట‌ల‌తో ఉండి గూడికి వెళ్లి పూజలు చేస్తే అనంత పుణ్య ఫ‌లం పొంద‌వ‌చ్చు.ఇది సాక్ష్యాత్తు బ్ర‌హ్మా దేవుడే చెప్పాడు.ఇక కార్తీక పౌర్ణ‌మి నాడు ప‌గ‌లు ఉప‌వాసం ఉండి ఎవ‌రైతే రుద్రాభిషేకం చేయిస్తారో వారు పుణ్య‌లోకాలు పొందుతార‌ని కార్తీక పురాణంలో కూడా అనేక‌ గాథ‌లు ఉన్నాయి.

గ‌త జ‌న్మ పాపాలుల‌తో సహా ఈ జ‌న్మ పాపాలు కూడా తొలిగిపోతాయి.మ‌హిళ‌లు దీపారాధ‌న చేయ‌డం వ‌ల్ల సౌభాగ్యం సిద్దిస్తుంది.మ‌న‌లోని అజ్ఞానమే చీక‌టిని తొల‌గించుకుని జ్ఞానం అనే జ్యోతిని వెలుగించుకోవ‌ల‌న్న‌దే కార్తీక మాసంలో చేసే దీపారాధాన వెనుక ఉన్న అస‌లు ఉద్దేశం.చాలామంది కార్తీక పౌర్ణ‌మి లేదా ద్వాద‌శి రోజున దీపాలు వెలుగిస్తారు.మ‌రికొంద‌రు 365 ఒత్తులు వేసి దీపాలు వెలుగిస్తారు.అయితే కార్తీక మాసంలో అగ్నిని కూడా పూజించాలి. కార్తీక మాసంలో చేసే ప‌నులు అగ్ని ,వేడి చూట్టునే తిరుగుతుంటాయి.దీపాలు పెట్డడం కూడా అందులో ఓ భాగ‌మే.ఈ మాసంలో భుమి చంద్రుడికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.అందుకే చ‌ల్ల‌ద‌నం పెరుగుతుంది.శరీరానికి వేడి ఎక్కువ అవ‌స‌రం.ఈ మాసంలోనే శ్వాస సంబంధ‌మైన వ్యాధులు ఎక్కువుగా వ‌స్తుంటాయి.నువ్వుల నునే ద్వారా వచ్చే వేడి శ్వాస సంబంధ‌మైన వ్యాధులను దూరం చేస్తాయి.ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ,సైన్స్‌కు సంబంధించిన విష‌యాలు ఎన్నో ఉన్నాయి.అందుకే దీపాలు పెట్టాలి అన్న‌ది కార్తీక మాసం ముఖ్య ఉద్దేశం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -