- Advertisement -

వైవి సుబ్బారెడ్డికి జ‌గ‌న్ షాక్‌…

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో వైసీపీనీ అధికారంలోకి తీసుకురావ‌డానికి ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అభ్య‌ర్తుల విష‌యంలో స్పీడ్ పెంచ‌నున్నారు. గెలుపు అవ‌కాశాలు లేకుంటే సొంత ప్యామీలి నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డానికి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. గెలిచే వారికే టికెట్లు ఇచ్చేందుకు జ‌గ‌న్ మొగ్గు చూపుతున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యానికి అభ్య‌ర్త‌ల ఎంపిక తారుమారు అవుతూ ఉంటుంది. ఆయా అభ్య‌ర్తుల ప్ర‌జా బ‌లం, సామాజిక‌, ఆర్థిక బ‌లం లాంటి అంశాల‌ను బేరీజు వేసుకొని టికెట్లు ఇవ్వ‌డం తెలిసిందే. ఎంత ఆర్థిక బ‌లం ఉన్నా గెలుపు అవ‌కాశాలు లేకుంటే టికెట్ క‌ష్ట‌మే.

తాజాగా ఇదే కోవలో చేరిపోయారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైవీకి టిక్కెట్ కష్టమేనని తెలుస్తోంది. 2014 లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్ర‌త్యేక హోదా కోసం త‌న ప‌ద‌విని వ‌దులుకొని మాజీగా ఉన్నారు. వైవీ స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అవ్వబోతున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి త్వరలోనే వైసీపీలోకి జంప్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ వైవీని తప్పించి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారని సమాచారం. ఇప్ప‌టికే జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

పార్లమెంట్ అభ్యర్థిగా ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చినా పార్టీలో మాగుంట ఇమడలేకపోతున్నారన్నది వాస్తవం. మంత్రి ప‌ద‌విమీద ఆశ‌పెట్టుకొంటే బాబు మొండి చేయి చూపారు. ఇక చేసేదేమి లేక వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

వైవీ సుబ్బారెడ్డికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ యోచిస్తున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వైవీ సుబ్బారెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎన్నికల మేనేజ్మెంట్ టీమ్ బాధ్యతలు నిర్వహించబోతున్నారనే ప్రచారం జ‌రుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -