Thursday, May 16, 2024
- Advertisement -

హీరోయిన్ లు హీరోల అఫైర్ ల గోల

- Advertisement -

బాలీవుడ్ కాసినోవాగా పిలవబడుతున్న కుర్ర హీరో అర్జున్ కపూర్ మిగిలిన యంగ్ హీరోల కన్నా ఎక్కువ ఎఫైర్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి తనతో వర్క్ చేసిన ప్రతీ హీరోయిన్ తో ఎఫైర్స్ నడిపిన చరిత్ర అర్జున్ కపూర్ కి ఉంది. పరిణితి చోప్రా నుండి మొదలుపెడితే సీనియర్ హీరోయిన్ కరీనాకపూర్ వరకు అందరితోను ఆఫ్ స్క్రీన్ లో రొమాన్స్ చేశాడట అర్జున్.

ఈ లిస్టులో పరిణితి, కరీనాకపూర్ లతో పాటు ఆలియా భట్, సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా మరియు మలైకా అరోరా ఖాన్ లు ఉండగా ఇప్పుడు లిస్టులోకి జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా వచ్చి చేరింది. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు కొత్త సినిమా చేస్తున్నారు. కాగా షూటింగ్ మొదలైన 10 రోజుల్లోనే ఇద్దరు తెగ క్లోజ్ అయ్యారట.

ఎంత క్లోజ్ అంటే రోజు షూటింగ్ అవ్వగానే నేరుగా పబ్ లకు లేకుంటే పేజ్ 3 ప్రైవేట్ పార్టీస్ కి కలిసి వెళ్ళే౦త క్లోజ్ అయ్యారట ఈ జంట. అర్జున్ కపూర్ తో సినిమా అంటే హీరోయిన్స్ అందరూ ఈయనతో రొమాన్స్ తెగ ఇష్టపడతారు అంటుంటారు కొందరు విశ్లేషకులు. అర్జున్ మాత్రం ఏ హీరోయిన్ తో ఎఫైర్ అయినా అది ఆ సినిమా వరకు మాత్రమే అంటాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -