Thursday, April 18, 2024
- Advertisement -

‘షూ బైట్‌’ సినిమా కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధం

- Advertisement -

కొన్ని సినిమాలు అంతే. మొత్తం సినిమా అంతా తీస్తారు.. విడుద‌ల చేద్దామంటే ఏదో ఒక వివాదం చుట్టు ముట్టుకుంటుంది. ఇప్పుడు ‘షూ బైట్‌’ అనే సినిమా హ‌క్కుల విష‌య‌మై ఇర‌వై ఏళ్లుగా విడుద‌ల కాలేద‌నే విష‌యం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీని గురించి ఇప్పుడు ఎందుకు చ‌ర్చ వ‌చ్చిందంటే ఇటీవ‌ల అమితాబ్ బ‌చ్చ‌న్ ఆ సినిమా విష‌యంపై స్పందించారు. ఆ త‌ర్వాత ఇప్పుడు ‘షూ బైట్‌’ సినిమా ద‌ర్శ‌కుడు సుర్జిత్ స‌ర్కార్ కూడా స్పందించారు. ఇప్పుడు తాను తీసిన ‘షూ బైట్‌’ సినిమా ఇల్లు అమ్మి అయినా విడుద‌ల చేయ‌డానికి చూస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

‘షూ బైట్‌’ సినిమాను ప‌దేళ్ల కింద‌ట రూపొందించారు. అప్పుడే విడుద‌ల కావాల్సి ఉంది. విడుద‌ల చేద్దామ‌నుకునే స‌మ‌యంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.ని మరుగున పడిపోయింది. భారత సంతతికి చెందిన హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ రాసిన స్క్రిప్టు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా.. దాని హక్కుల విషయమై వివాదం నెలకొంది.

ఈ విష‌య‌మై కొన్ని రోజుల కిందట బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్వీట‌ర్‌లో ప్ర‌స్తావించాడు. తాము ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని.. దయచేసి ఈ సినిమా విడుద‌ల చేయాలని ఆ చిత్ర నిర్మాణ సంస్థ.. దీనికి అడ్డుపడుతున్న సంస్థల‌ను అమితాబ్ కోరాడు. ‘విక్కీ డోనర్’ సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న సుర్జిత్ సిర్కార్ ‘షూ బైట్‌’ సినిమా రూపొందించాడు.

అమితాబ్ స్పందించ‌డంతో ఈ సినిమా విష‌య‌మై ద‌ర్శ‌కుడు సుర్జిత్ సిర్కార్ కూడా స్పందించాడు. ‘షూ బైట్‌’ సినిమాను విడుద‌ల చేయ‌డానికి తాను ఏం చేయడానికైనా సిద్ధమని ప్ర‌క‌టించాడు. ఎంతైనా ఖర్చు పెట్టుకుంటానని తెలిపాడు. తన ఇల్లు అమ్మి అయినా సరే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తానని.. దయచేసి సినిమాను బయటికి తేవడానికి సహకరించాలని యూటీవీ వాళ్లను కోరాడు. మరి ఇంతమంది కోరుతుండ‌డంతో ఇప్ప‌టికైనా స్పంద‌న వ‌స్తుందా.. సినిమా విడుద‌ల అవుతుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -