Friday, May 3, 2024
- Advertisement -

స్పీకరా….? టిడిపి నాయకుడా….?

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేస్తుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి కాళ్ళకు దండం పెట్టడం ఎంతవరకూ న్యాయం, చంద్రబాబుని విమర్శించండి, కేంద్రాన్ని విమర్శించొద్దు, విమర్శిస్తే…వాళ్ళకు కోపం వస్తే మనపైన కేసులు ఉన్నాయి, జైళ్ళో పెడతారని చెబుతున్నారు…… ఇవి ఏ టిడిపి నాయకుడో, ఎమ్మెల్యేనో, మంత్రినో, చంద్రబాబో జగన్‌పై చేసిన విమర్శలు కావు. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తా అని చెప్పి ప్రమాణం చేసి స్పీకర్ కుర్చీలో కూర్చున్న కోడెల శివప్రసాద్‌రావు చేసిన వ్యాఖ్యలు.

ఈ మాటలు చెప్పిన సందర్భంలోనే అసెంబ్లీ పవిత్రత గురించి కూడా కోడెల గొప్పగా చెప్పడం ఆలోచనాపరులను ఆశ్ఛర్యానికి గురిచేసింది. ఒక అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తానని ప్రమాణం చేసిన స్పీకరే పూర్తిగా టిడిపి నాయకుడిలా మాట్లాడిన తర్వాత ఇంకా ఆ అసెంబ్లీకి పవిత్రత ఉంటుందా? విజయసాయి మోడీ కాళ్ళకు దండం పెట్టాడు అని ఇప్పటి వరకూ టిడిపి నాయకులే గట్టిగా చెప్పలేకపోయారు. అలాంటిది స్పీకర్ మాత్రం కచ్చితంగా తనకు తెలిసినట్టుగా చెప్పేశాడు. ఇక ఆ తర్వాత కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు కోడెల.

‘తిట్టిపోతే, బెదిరిస్తే బెదిరిపోతాననుకోవద్దు….ఉడత ఊపులకు చింతకాయలు రాలవు, అయినా బురదలో దొర్లాడే పందికి, గేదెకు సెంటు వాసన చూపిస్తే ఏం అర్థమవుతుంది?’ అని వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్ష నేతపై తనకు ఉన్న గౌరవం ఏంటో చెప్పకనే చెప్పేశాడు స్పీకర్ కోడెల. స్పీకర్ స్థాయి వ్యక్తి పూర్తిగా టిడిపి నేతగా మారిపోయి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశాక కూడా ఇంకా ఆ అసెంబ్లీకి ఉన్న పవిత్రత ఏంటో? ఆ అసెంబ్లీకి ఉన్న గొప్పదనం ఏంటో ఇక ఆంధ్రప్రదేశ్ ఓటర్లే ఆలోచించుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -