Wednesday, May 15, 2024
- Advertisement -

మళ్లీ వాయిదా పడిన శ్రద్ధా కపూర్ సినిమా

- Advertisement -

నిజానికి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కి ఆగస్టు లో రెండు సినిమాలు విడుదల కావాల్సింది. అందులో ఒకటి ‘సాహో’ కాగా మరొకటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ‘చిచ్చోరి’ అనే హిందీ సినిమా. అయితే ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘సాహో’ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే రోజున బాలీవుడ్లో ‘మిషన్ మంగళ్’, ‘బట్ల హౌస్’ పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో దర్శక నిర్మాతలు తమ సినిమాని వాయిదా వేశారని సమాచారం. ఇప్పుడు సాహో సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

మరోవైపు ‘చిచ్చోరి’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికి దర్శక నిర్మాతలు కనీసం ట్రైలర్ కూడా ఇంకా విడుదల చేయలేదు. అంతకు ముందు ఎప్పుడో ఒక టీజర్ విడుదల చేశారు. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి వార్త బయటకు రాలేదు. బ్లాక్ కామెడీ నేపథ్యంలో ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 6 కి వాయిదా పడిందట. మరోవైపు శ్రద్ధ కపూర్ ‘ఏబిసిడి 2’ సినిమా షూటింగ్తో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక శ్రద్ధ ‘భాగి 3’ షూటింగ్ లో పాల్గొనబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -