Sunday, May 19, 2024
- Advertisement -

ఫెమినాపై మెరిసిన సాహో హీరోయిన్‌

- Advertisement -
  • శ్ర‌ద్ధాక‌పూర్ ఫొటోషూట్‌

ఆషికీ-2 సినిమాతో అద్భుత న‌ట‌న‌తో పాటు అన్నింటిలోనూ జీవించిన న‌టి శ్ర‌ద్ధాక‌పూర్ ఇప్పుడు హాట్‌హాట్‌గా క‌నిపిస్తోంది. బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మ‌డు తెలుగులోనూ వ‌స్తోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా సాహో. ఈ సినిమాలో శ్ర‌ద్ధాక‌పూర్ చాన్స్ కొట్టేసింది. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అయితే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఆ అమ్మ‌డు ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌లో మెరిసిపోయింది. కుర్రాళ్ల మ‌తిపోగోడుతోంది.

ప్ర‌స్తుతం ఈ భామ‌కు తెలుగులో అభిమానుల ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం ఫెమినా మ్యాగ‌జైన్ క‌వర్ పేజీ కోసం ఫోజులిచ్చింది. మిరుమిట్లు గొలిపే డ్రెస్‌లో శ్ర‌ద్ధాక‌పూర్ క‌నిపిస్తోంది. ఈ ఫొటో చూస్తే యువ‌త‌రం చూడ‌గానే హ‌త్తుకుపోయేలా ఉంది.

ప్ర‌స్తుతం శ్ర‌ద్ధా `సాహో` చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న అలాంటి క‌వ్వించే పాత్ర‌లోనే క‌నిపించ‌బోతోంది. ప‌ల్లెటూరి అమ్మాయి .. అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన పాత్ర‌లో క‌నిపిస్తోంద‌ని టాక్‌. ఇంకోటి రాజ్‌కుమార్ రావ్ స‌ర‌స‌న ఓ రొమాంటిక్ కామెడీలో న‌టిస్తోంది. బ్యాడ్మింట‌న్ స్టార్‌ సైనా నెహ్వాల్ జీవిత క‌థ‌లోనూ న‌టించ‌నుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -