Sunday, April 28, 2024
- Advertisement -

బన్నీ యూ ట్యూబ్ స్టార్ అయిపోయినట్లేనా..?

- Advertisement -

అల్లు అర్జున్ మేనియా కేరళ వరకు అనుకుని ఇంతకాలం వావ్ అనుకున్నాం. ఇపుడీ డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రతిభ ముంబాయి వరకు పాకింది. నాట్ ఓన్లీ ముంబాయి. హిందీ సినీ లవర్స్ అందరికీ మనోడి ప్రతిభ నచ్చేసింది. దీనికి కొలమానంగా అతను చేసిన చిత్రాలు …హిందీలోకి డబ్ అయి ఆతరువాత యూ ట్యూబ్ లో దుమ్ము దులపుతూ ఉండటమే. కేవలం థియేటర్లో కాకుండా యూ ట్యూబ్ లో ఈసినిమాలకు విపరీతమైన గిరాకి లభిస్తుంది. బహుబలి వచ్చిన కొత్తలో ప్రభాస్ నటించిన ఫ్లాప్ మూవీ రెబల్ కు 15 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయో అంతకంటూ టూమచ్ గా బాహుబలికంటే ఎక్కువగా బన్నీ సినిమాలకు యూ ట్యూబ్ హిందీ వెర్షన్ లో ఎక్కువ వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

సరైనోడు హింది వెర్షన్ కు యు ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దాటేయడా …ఇపుడు దువ్వాడ జగన్నాధం కూడా అదే దారిలో ప్రయాణం చేస్తోంది. అప్ లోడ్ చేసిన 15 రోజులకే ఈ సినిమా 50 మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డు సెట్ చేసింది. సరైనోడు 50 మిలియన్ వ్యూస్ దాటడానికి 43రోజులు టైమ్ పడితే…దానికంటే సగం రోజులకే డిజే ఆ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.ఒకవేళ రేపన్న రోజు తక్కువ టైమ్లోనే డిజే కూడా 100మిలియన్ వ్యూస్ ను అందుకుంటే..యూ ట్యూబ్ స్టార్ గా యూ ట్యూబ్ కంపెనీవారే మనోడికి మెమెంటో లాంటిది పంపొచ్చు. ఏది ఏమైనా బన్నీ దూకుడు ముందు టాలీవుడ్ హీరోలెవరు సోషల్ మీడియాలో సరిపోవడం లేదు.ఎంతైనా స్టైలిష్ స్టార్ కదా. మెట్రో ఆడియన్స్ కు భాగా నచ్చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -