Friday, May 17, 2024
- Advertisement -

సాయిధరమ్ తేజ్ పేరు చెబితే వాళ్లు వణుకుతున్నారు!!

- Advertisement -

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి పడిన చిచ్చరపిడుగు…. సాయిధరమ్ తేజ్. బన్నీని మించిన ఎనర్జీ, చెర్రీని తలదన్నే లౌక్యం, చిరు ఫ్లేవర్ డ్యాన్స్ ,ఫైట్స్ తో మనోడు ఎక్కడికో వెళ్లిపోయాడు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఓవర్సీస్ టాక్ ను కొలమానం చేసుకోకుండా ఇండియాలో వచ్చిన  కలెక్షన్ రిపోర్ట్ తో… సాయిబాబు ప్రొఫైల్ ను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పెంచేశారు. ఇపుడదే….. మిగతా హీరోలకు పెద్ద ప్రాబ్లమై కూర్చుంది. 

అందుల్లో ను బన్నీ తర్వాత ఎనర్జిటిక్ హీరోగా నోటెడైన రామ్ ,పోటుగాడినంటూ హల్చల్ చేసే మంచు మనోజ్ ,ఇంకా లాంగ్ కెరియర్ ను కంటిన్యూ చేయలేడని పేరొందిన రవితేజలకు సాయిధరమ్ పెద్ద ఇబ్బందే తెచ్చిపెట్టాడు. వీరిని చూసి కథలు  తయారు చేసుకున్న డైరెక్టర్లంతా ….ఇపుడు  సాయి కోసం పరిగెడుతున్నారు.సాయి అపాయింట్ మెంట్ ఇస్తే చాలు…. మా కథలకు అతనే న్యాయం చేస్తాడంటున్నారు. ఈ తతంగమంతా చూస్తోన్న మెగా కాంపౌండ్ ఆశ్చర్యపోతోంది. అల్లు అరవింద్ అయితే…కనీసం సాయి ఇలా పైకొస్తాడని అస్సలు ఊహించ లేదట. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. 

ఎందుకైనా మంచిదని మనోడి కాల్షీట్స్ తీసుకుని చైతుకు 100% లవ్ ఇచ్చినట్లు సాయికి కూడా ఓ హిట్ ఇస్తే ఓ పనై పోతుందనుకుంటున్నాడు. ఐతే అందుల్లో కూడా హీరోయిజాన్ని ఎంత వరకూ లేపాలో అంత వరకూ మాత్రమే లేపి తన చాతుర్యతను చూపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -