యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా ను తెరకేకిస్తున్నాడు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా మూవీ మేకర్ గా ప్రశాంత్ నీల్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ’సలార్’ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అవకాశాన్ని దక్కించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి అదృష్టం శ్రుతి హసన్ ను వరించింది.
మంచి ఫాంలో ఉన్న హీరోయిన్లను పక్కకి పెట్టి, కొంతకాలంగా సక్సెస్ గ్రాఫ్ లేని శ్రుతి హాసన్ అవకాశాన్ని కొట్టేయడం గొప్ప విషయం. ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ తొలిసారి నటిస్తుంది. తొలిసారి ప్రభాస్ తో కలిసి నటిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రీసెంట్ గా ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు.
సెట్లో ప్రభాస్ వ్యవహార శైలి పై శ్రుతి హసన్ మాట్లాడుతూ … “ప్రభాస్ చాలా సింపుల్ .. అంతటి క్రేజ్ ఉన్న ఆయన అంత సింపుల్ గా ఉంటారని నేను అనుకోలేదు. ఆయన చాలా ప్రేమతో మాట్లాడతారు .. సెట్లోని అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రభాస్ సెట్లో ఉన్నంత సేపు అక్కడి వాతావరణం సందడిగా ఉంటుంది. తాను ఒక పెద్ద స్టార్ ను అనే విషయాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఆయనతో కలిసి నటించడం ఎవరికైనా కంఫర్ట్ గానే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.
అప్పుడు నో చెప్పి.. ఇప్పుడు ఓకే అన్న సాయి పల్లవి!