‘మాస్ట‌ర్’‌ డైరెక్టర్‌తో ప్రభాస్‌ సినిమా !

- Advertisement -

ఈశ్వ‌ర్ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మై.. ఛ‌త్ర‌ప‌తి, బ‌హుబ‌లి, బ‌హుబ‌లి-2, సాహో వంటి సినిమాల‌తో అగ్ర క‌థానాయ‌కుడిగా, పాన్ ఇండియా హీరోగా ఎదిగిన న‌టుడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న న‌టించిన రాధేశ్యామ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక‌ముందే ప్ర‌భాస్ మ‌రో మూడు పాన్ ఇండియా ప్రాజెక్టుల‌కు ఒకే చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం భార‌తీయ సంచ‌ల‌న చిత్రం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో స‌లార్ అనే సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్‌. భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా సినిమాగా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాక‌ముందే మాస్ట‌ర్ సినిమాతో హిట్ కొట్టిన కోటీవుడ్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్ లో సినిమా చేయ‌డానాకి ప్ర‌‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

విజ‌య్‌తో మాస్ట‌ర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన లోకేశ్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం కమల్‌ హాసన్‌తో ‘విక్రమ్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ప్రభాస్‌తోనే చిత్రం తీస్తార‌ని కోలీవుడ్ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, స‌లార్, ఆదిపురుష్ సినిమాలు పూర్త‌యిన వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌నున్నారు ప్ర‌భాస్‌.

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -