పూరి జగన్నాథ్‌పై ఛార్మి సీరియస్‌.. కారణం ఇదేనా?

- Advertisement -

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరోయిన్ చార్మి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని ఏళ్లుగా పూరితో సన్నిహితంగా ఉంటూ.. ఆయనకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతూ.. నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది చార్మి. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనక్ట్స్‌ బ్యానర్స్‌లో జోడీగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. వీరిద్దరు మధ్య ఏదో ఉందని, పూరితో చార్మీ డేటింగ్‌లో ఉందని వార్తలు వచ్చిన పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటుపోతున్నారు.

ఈ ఇద్దరూ ఒకటిగా సినిమాలు మొదలుపెట్టాక.. మొదట్లో కాస్త కుదుపులు ఎదురైనా ‘ఇస్మార్ట్ శంకర్’అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ జోష్‌లోకి వచ్చారు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా 42 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా పూరిపై ఛార్మి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇస్మార్ట్ శంకర్ సినిమానేనట. ఆ సినిమా బడ్జెట్ విషయంలో పూరి కంటే కూడా ఛార్మినే ఎక్కువ పెట్టుబడి పెట్టిందట. కానీ లాభాలు వచ్చాక మాత్రం ఛార్మి కంటే పూరినే ఎక్కువ లాభలు తీసుకున్నారని సమాచారం. దీనిపై ఛార్మీ నిలదీయగా.. తన తరువాత సినిమా విషయంలో ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తానని మాట ఇచ్చాడట పూరి. కానీ ఇప్పుడ మాటను మర్చిపోయాడని సన్నిహితల దగ్గర చెప్పుకుంటూ తెగ ఫీలవుతుందట ఛార్మి.

- Advertisement -

ప్రస్తుతం పూరి, ఛార్మి కలిసి విజయ్‌ దేవరకొండతో కలిసి లైగర్‌ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి తనకే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడిన ఛార్మికి పూరి షాకిచ్చాడట. ఈ సినిమా హింది వెర్షన్‌ను కరుణ్‌ జోహార్‌ పూర్తిగా తీసుకుంటే.. తెలుగు వెర్షన్‌ హక్కులను పూరి ఉంచుకున్నాడట. దీంతో మొదటి నుంచి కష్టపడిన చార్మికి ఏమి మిగలలేదు. ఈ విషయంపైనే పూరిపై ఛార్మి ఫైర్‌ అయినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్‌ కళ్యాణ్ ఒక వ్యసనం.. నవ్వులు పూయిస్తున్న బండ్ల గణేశ్‌ స్పీచ్‌

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

అల్లు అరవింద్‌కు కరోనా.. ఏం జరిగిందంటే !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -